చంద్రబాబు గాలి దీక్షలు చేస్తున్నారు!: కన్నా విమర్శలు

  • చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకున్నారు
  • ఈ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు
  • మోదీ గురించి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది
సీఎం చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గాలి దీక్షలు చేస్తున్నారని, దోచుకున్న ప్రజల సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, గతంలో జరిగిన నంద్యాల ఉపఎన్నికలలో చంద్రబాబు వైఖరే ఇందుకు నిదర్శనమని అన్నారు. టీడీపీకి ఓటు వేయని వాళ్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, ప్రధాని మోదీ గురించి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
kanna

More Telugu News